Breaking : శ్రీశైలం ఎడమగట్టు కాల్వ టన్నెల్ కింద ప్రమాదం.. లోపల కూలీలు?
శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ టన్నెల కింద ప్రమాదం జరిగింది. మూడు మీటర్ల మేరకు పై కప్పు కుంగిందని తెలిసింది;

శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ టన్నెల కింద ప్రమాదం జరిగింది. మూడు మీటర్ల మేరకు పై కప్పు కుంగిందని తెలిసింది. ఎడమవైపు సొరంగం పథ్నాలుగో కిలోమీటర్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలడంతో అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సహాయక చర్యలు ప్రారంభించారు.
సహాయక చర్యలు...
ప్రమాదం జరిగిన సమయంలో టన్నెల్ లోపల ఐదారు మంది కూలీలు ఉన్నట్టు సమాచారం ఉంది. అయితే దీనిపై ఇంకా క్లారిటీ లేదు. ఒక్కసారి కుప్ప కూలడంతో అధికారులు అప్రమత్తమై వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. మూడు మీటర్లు మేరకు పై కప్పు కుంగడంతో అధికారులు అందుకు తగినట్లుగా చర్యలు ప్రారంభించినట్లు తెలిసింది.