ప్రణయ్ హత్య కేసులో ఆరుగురికి జీవిత ఖైదు
నల్లగొండ జిల్లాలో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులో నిందితులకు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది;

నల్లగొండ జిల్లాలో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులో నిందితులకు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ప్రణయ్ హత్య కేసులో మొత్తం ఎనిమిది మంది నిందితులుంగా, అందులో ఒకరు చనిపోయారు. మిగిలిన ఆరుగురు నిందితులకు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. నల్లగొండబ జిల్లాలో ప్రణయ్ హత్య కేసు అప్పట్లో సంచలనం కలిగించింది.
2018లో జరిగిన...
2018లో ప్రణయ్ హత్య జరిగింది. మతాంతర వివాహం చేసుకున్నాడని ప్రణయ్ ను అమృత తండ్రి మారుతీరావు నిందితులకు సుపారీ ఇచ్చి ఆసుపత్రికి వెళ్లి వస్తుండగా హత్య చేశారు. ఇందులో మొత్తం ఎనిమిది అయితే తర్వాత అమృత తండ్రి మారుతిరావు ఆత్మహత్య చేసుకోవడంతో ఇక ఆరుగురు మిగిలారు. ఈ కేసులో ఎ2 నిందితుడిగా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష గతంలో విధించింది. కుట్ర చేసి హత్య చేశారన్న ఆరోపణల నేపథ్యంలో న్యాయస్థానం ఈ మేరకు తీర్పు చెప్పింది.