BRS : రేపటి కేటీఆర్ ధర్నాకు అనుమతి నిరాకరణ
బీఆర్ఎస్ ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. రేపు నల్లగొండలో బీఆర్ఎస్ ధర్నా నిర్వహించాలని నిర్ణయించింది;

బీఆర్ఎస్ ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. రేపు నల్లగొండలో బీఆర్ఎస్ ధర్నా నిర్వహించాలని నిర్ణయించింది. రైతుల ధర్నా కోసం పోలీసులకు స్థానిక బీఆర్ఎస్ నేతలు అనుమతి కోరారు. అయితే పోలీసులు మాత్రం ధర్నాకు అనుమతి నిరాకరించారు. దీంతో బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించాలన్న ఆలోచనలో ఉన్నారు.
రేపు నల్లగొండలో...
ఇటీవల రంగారెడ్డి జిల్లా షాబాద్ లో రైతు ల కోసం ధర్నా నిర్వహించిన సంగతి తెలిసిందే. రేపు నల్లగొండలో జరిగే రైతు ధర్నాకు కూడా కేటీఆర్ హాజరు కానున్నారు. అయితే దీనికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయితే రేపు ధర్నాను నిర్వహించి తీరుతామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. పోలీసులు మాత్రం ససేమిరా అంటున్నారు.