BRS : నేడు బీఆర్ఎస్ మహా ధర్నా

బీఆర్ఎస్ పార్టీ నేడు నల్లగొండ లో మహా ధర్నా నిర్వహించనుంది. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయనందుకు నిరసనగా చేపట్టింది.;

Update: 2025-01-28 02:13 GMT
brs,  maha dharna, farmers,  nalgonda
  • whatsapp icon

బీఆర్ఎస్ పార్టీ నేడు నల్లగొండ లో మహా ధర్నా నిర్వహించనుంది. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయనందుకు నిరసనగా ఈ ధర్నా చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలను అమలు చేయకుండా రైతులను నిలువునా ముంచిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల రైతు సమస్యలపై షాబాద్ లో రైతు ధర్నా చేసిన సంగతి తెలిసిందే.

రైతులకు ఇచ్చిన హామీలను...
రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చకుండా మోసం చేసిందని, వాటిని వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ ఈ రైతు మహాధర్నా కార్యక్రమం చేపట్టింది. నల్లగొండ క్లాక్ టవర్ వేదికగా జరగనున్న ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు కూడా పాల్గొననున్నారు. జంగ్ సైరన్ పేరిట ఈ ధర్నాను బీఆర్ఎస్ నిర్వహించనుంది.


Tags:    

Similar News