KTR : నల్లగొండ జిల్లాలో కేటీఆర్ పై కేసు నమోదు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు నమోదు అయింది.;

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు నమోదు అయింది. నకిరేకల్ పీఎస్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు నమోదయినట్లు పోలీసులు తెలిపారు. పదోతరగతి స్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ నిందితులతో సంబంధాలు ఉన్నాయంటూ తమపై కేటీఆర్ ట్వీట్ చేశారంటూ మున్సిపల్ ఛైర్మన్ చెవుగోని రజిత, శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు.
పదో తరగతి పరీక్షల్లో...
దీంతో ఫిర్యాదు ను తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారుు. ఈ ఘటనకు సంబంధించి కు కేటీఆర్‌పై రెండు కేసులు నమోదు చేసిన నకిరేకల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పదో తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరిగిందని, దీని వెనక కాంగ్రెస్ నేతలున్నారన్న కేటీఆర్ ఆరోపణలపై సీరియస్ గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.