పెరుగుతున్న కరోనా కేసులు
భారత్‌లో 24 గంటల్లో 12,193 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎనిమిది రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది
భారత్‌లో కరోనా వ్యాప్తి తగ్గడం లేదు. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 12,193 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే కరోనా వైరస్ కేసులు సంఖ్య అధికంగా ఉన్న ఎనిమిది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. తక్షణమే కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాల్లోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.
ఎనిమిది రాష్ట్రాలకు...
భారత్‌లో యాక్టివ్ కేసుల సంఖ్య 67,556కు చేరుకుంది. ఒక్కరోజులో 10,765 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా లేకుంటే కేసుల సంఖ్య మరింత పెరుగుతుందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి చేయాలని, శానిటైజర్ వాడకం కూడా ప్రారంభించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.