Rahul Gandhi; గౌతమ్ అదానీని వెంటనే అరెస్ట్ చేయాలి

ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని వెంటనే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.;

Update: 2024-11-21 08:14 GMT

Rahul gandhi reached hyderabad

ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని వెంటనే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అమెరికాలోనూ అదానీ అక్రమాలకు పాల్పడ్డారని, అందుకే ఆయనపై అక్కడ కేసు నమోదయిందని రాహుల్ అన్నారు. అదానీని రక్షించేందుకు మోదీ నిరంతరం శ్రమిస్తున్నారన్న రాహుల్ గాంధీ లంచాలు ఇవ్వచూపిన కేసులో విచారణ చేసి అదానీని అరెస్ట్ చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

జేపీసీ వేసి విచారణ జరిపి...
అదానీ నేరాలపై తక్షణమే జేపీసీ వేసి విచారణ జరిపించాలని కూడా రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అదానీకి భారత ప్రభుత్వం రక్షణగా నిలుస్తుందని, ఈ దేశంలో ఆయనను అరెస్ట్ చేయడం కానీ, కేసులను విచారణ చేయడం కానీ జరగదని రాహుల్ గాంధీ తెలిపారు. దేశంలో గౌతమ్ అదానీ స్వేచ్ఛగా తిరుగుతున్నారని, ప్రధాని నరేంద్ర మోదీ ఆయనను రక్షిస్తున్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.



Tags:    

Similar News