జవాన్ స్వీట్ సర్‌ప్రైజ్: తల్లి భావోద్వేగం వైరల్ వీడియో

తన కొడుకుని దేశ రక్షణ కోసం ఆ తల్లి జవానుగా చేసింది. సుదీర్ఘకాలం తర్వాత జవాన్ తన సొంత ఇంటికి తిరిగి వచ్చాడు.

Update: 2024-11-21 06:24 GMT

దేశ రక్షణలో జవాన్లది కీలక పాత్ర. మంచులోనూ, చలిలోనూ నిరంతరం కష్టపడుతూ యుద్ధ సమయాయల్లో అశువులు బాసేది వారే. సరిహద్దుల రక్షణ కోసం వారు నిరంతరం పడే శ్రమ ఎవరూ తక్కువగా అంచనా వేయలేం.అందుకే జవాన్లు దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ఉంటే.. మనం సంతోషంగా సురక్షితంగా మన ఇళ్లలో మనగలుతాం. అలాంటి జవాన్ సెలవుల్లో ఇంటికి వస్తే ఒక తల్లి భావోద్వేగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గామ మారింది.

సుదీర్ఘ కాలం తర్వాత...
తన కొడుకుని దేశ రక్షణ కోసం ఆ తల్లి సరిహద్దులకు పంపింది. వీర జవానుగా చేసింది. సుదీర్ఘకాలం తర్వాత జవాన్ తన సొంత ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే ఆ తల్లి తాను కొబ్బరి కాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ కొడుకును సరిహద్దులకు జవానుగా పంపింది. చాలా రోజుల తర్వాత తిరిగి వచ్చిన కొడుకును చూసి ఆ తల్లి భావోద్వేగానికి గురయింది. కొడుకుని హత్తుకుని ఏడ్చేసింది. ఈ నెల 5వ తేదీన జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Tags:    

Similar News