ఎంపీ నవనీత్ కౌర్ రాణా దంపతులకు 14 రోజులు రిమాండ్

హ‌నుమాన్ జ‌యంతి సంద‌ర్భంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే హనుమాన్ చాలీసా పఠించాల‌ని, లేకపోతే తామే..

Update: 2022-04-24 13:38 GMT

ముంబై : హనుమాన్ చాలీసా వివాదంలో నిన్న ఎంపీ నవనీత్ కౌర్ రాణా, ఆమె భర్త, ఎమ్మెల్యే రవి రాణాలను నిన్న ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వారిద్దరినీ నేడు ముంబై బాంద్రా మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి వారిద్దరికీ 14 రోజులు రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో, నవనీత్ రాణా దంపతుల తరఫు న్యాయవాది కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 29న బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది.

అసలేం జరిగిందంటే.. హ‌నుమాన్ జ‌యంతి సంద‌ర్భంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే హనుమాన్ చాలీసా పఠించాల‌ని, లేకపోతే తామే సీఎం ఇంటి ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తామని ఎంపీ నవనీత్ కౌర్ రాణా, ఆమె భర్త, ఎమ్మెల్యే రవి రాణాలు ప్ర‌క‌టించారు. ఈ నేపథ్యంలో శివసేన శ్రేణులు నవనీత్ కౌర్ ఇంటి ముట్టడికి యత్నించారు. నవనీత్ దంపతుల ఫిర్యాదు మేరకు శివసేన కార్యకర్తలపై కేసు నమోదైంది. అటు, ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో, సీఎం నివాసం ఎదుట హనుమాన్ చాలీసా పఠించాలన్న తమ కార్యాచరణను నవనీత్ రాణా, రవి రాణా విరమించుకున్నారు. కానీ.. ఒక సీఎంను ఉద్దేశించి.. ఇలాంటివి చేయడం సరికాదని పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేశారు.


Tags:    

Similar News