పొంచి ఉన్న తీవ్రవాదుల ముప్పు.. ఎంతమంది యాక్టివ్ గా ఉన్నారంటే?

జమ్మూ కశ్మీర్‌లో ప్రస్తుతం 119 మంది ఉగ్రవాదులు యాక్టివ్ గా ఉన్నారని ఇంటెలిజెన్స్ సమాచారం.

Update: 2024-11-13 12:00 GMT

జమ్మూ కశ్మీర్‌లో ప్రస్తుతం 119 మంది ఉగ్రవాదులు యాక్టివ్ గా ఉన్నారని ఇంటెలిజెన్స్ సమాచారం.ఇందులో 79 మంది పీర్‌ పంజాల్‌ ఉత్తర భాగంలో ఉన్నారు. వీరిలో 18 మంది స్థానికులు కాగా, 61 మంది పాక్‌ జాతీయులు. దక్షిణ భాగంలో 40 మంది ఉండగా వారిలో 34 మంది విదేశీయులు. ఆరుగురు మాత్రమే స్థానికులు ఉన్నారు. 2024లో ఇప్పటి దాకా భద్రతా బలగాలు 61 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. జమ్మూ కశ్మీర్‌లోని లోతట్టు ప్రాంతాలలో 45 మంది, నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) సమీపంలో 16 మందిని హతం చేశాయి భారత దళాలు. హతమైన ఉగ్రవాదుల్లో 21 మంది పాకిస్థానీ పౌరులుగా గుర్తించారు. ఈ ఏడాదిలో ఇంతవరకు 25 ఉగ్రవాద సంబంధిత సంఘటనలు చోటు చేసుకున్నాయి. తీవ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో 24 మంది జవాన్లు, అధికారులు ప్రాణాలు కోల్పోయారు.

ఉగ్రవాద ముఠాల్లో చేరడానికి కశ్మీర్ ప్రజలు ఆసక్తి చూపించకపోవడంతో పాకిస్థాన్‌లోని నిరుద్యోగులను, నిరక్షరాస్యులను తీవ్రవాదం వైపు ఆకర్షితులయ్యేలా చేస్తున్నారు తీవ్రవాద గ్రూపుల కమాండర్లు. ఎల్‌ఓసీ కార్యకలాపాల్లో తగ్గుదల కనిపించడం, స్థానికులు తీవ్రవాదం వైపు వెళ్ళకపోవడంతో అక్కడి పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి.


Tags:    

Similar News