ట్రంప్ వచ్చాడు.. ఏ నిర్ణయం తీసుకుంటాడో.. ఇండియన్స్‌లో కలవరం
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వలసదారులపై వేటు వేసేందుకు సిద్ధమయ్యారు
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వలసదారులపై వేటు వేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ట్రంప్ దూకుడు నిర్ణయాలు భారతీయ పౌరులను కలవరపరుస్తున్నాయి. ఆందోళనకు గురిచేస్తున్నాయి. ట్రంప్ ఎన్నికల ప్రచారంలోనూ అక్రమంగా అమెరికాలో ఉంటున్న వారిని వారి దేశాలకు పంపించి వేస్తానని చెప్పారు.
సిటిజన్‌షిప్ రద్దవుతుందని...
అయితే మరొక వార్త కూడా భారతీయ పౌరులను కలవరపెడుతుంది. ఆటోమేటిక్ గా సిటిజన్‌షిప్ రద్దయ్యేది అక్రమంగా ఉంటున్న వారికేనని ట్రంప్ చెప్పినా ఇప్పుడు కొత్త ప్రచారం మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఆటోమేటిక్ గా సిటిజన్ షిప్ రద్దవుతుందని వార్తలు కలవరానికి గురి చేస్తున్నాయి.అమెరికా నిబంధనల ప్రకారం గ్రీన్ కార్డు, హెచ్‌వన్‌బీ వీసా, స్టూడెంట్ వీసా లేకపోయినా అక్కడ పిల్లలు జన్మిస్తే నేరుగా అమెరికా పౌరసత్వం లభిస్తుంది. అనంతరం తల్లిదండ్రులకు కూడా సిటిజన్ షిప్ వస్తుంది. ఈ నిబంధనను ట్రంప్ మారుస్తారన్న ప్రచారం ఇప్పుడు కంటి మీద కునుకులేకుండా చేస్తుంది. మరి ట్రంప్ ఏం నిర్ణయం తీసుకుంటారో అన్న ఉత్కంఠతతో భారతీయులు అక్కడ ఉంటున్నారు.