శాంతించిన కరోనా
24 గంటల్లో భారత్‌లో 4,282 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 14 మంది మరణించారు.
భారత్‌లో కరోనా వ్యాప్తి గణనీయంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 4,282 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 14 మంది కరోనా కారణంగా మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఇటీవల కాలంలో ఇంత తక్కువ స్థాయిలో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి అని వైద్యులు చెబుతున్నారు.
యాక్టివ్ కేసులు...
ప్రస్తుతం భారత్‌లో యాక్టివ్ కేసులు 47,246 ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందేనని, కోవిడ్ నిబంధనలు ఆ యా రాష్ట్రాలు అమలు చేయాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రజలు భౌతిక దూరం పాటించడం, మాస్క్‌లు ధరించడం వంటివి చేయకపోతే కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు.