ఆదిత్య ఉపగ్రహాన్ని ఎల్1 మార్గంలో ప్రవేశపెట్టాం: ఇస్రో కీలక ప్రకటన

చంద్రయాన్‌3ని సక్సెస్‌ఫుల్‌ చేసిన ఇస్రో.. సూర్యుని రహస్యాలు తెలుసుకునేందుకు ఆదిత్య ఎల్‌1ను పంపిన విషయం తెలిసిందే..

Update: 2023-10-09 04:39 GMT

చంద్రయాన్‌3ని సక్సెస్‌ఫుల్‌ చేసిన ఇస్రో.. సూర్యుని రహస్యాలు తెలుసుకునేందుకు ఆదిత్య ఎల్‌1ను పంపిన విషయం తెలిసిందే. అయితే ఆదిత్య- ఎల్‌1 ఉపగ్రహం తన లక్ష్యం దిశగా ప్రయాణం చేస్తోంది. అయితే ఇప్పటికే ఆదిత్య ఎల్1 ఉపగ్రహం భూ గురుత్వాకర్షణ పరిధిని దాటేసింది. ఈ క్రమంలోనే వ్యౌమనౌక మార్గాన్ని సరిదిద్దే విన్యాసాన్ని విజయవంతంగా చేపట్టినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ పేర్కొంది. లగ్రాంజ్‌ పాయింట్‌-1 (L1) దిశగా దూసుకెళ్తున్నటువంటి వ్యౌమనౌకను దాని నిర్దేశిత మార్గంలో ఉంచేందుకు టీసీఎం ఎంతగానో దోహదపడుతుంది. అయితే అక్టోబరు 6వ తేదీన 16 సెకన్ల పాటు ఈ ఆదిత్య ఎల్‌1 మార్గం ప్రదర్శన చేపట్టి సరిదిద్దినట్లు ఇస్రో పేర్కొంది. సెప్టెంబరు 19న ట్రాన్స్- లగ్రాంజియన్ పాయింట్ 1 ఇన్సర్షన్ విన్యాసాన్ని నిర్వహించి.. ఆదిత్య ఉపగ్రహాన్ని ‘ఎల్‌ 1’ వద్దకు చేర్చే మార్గంలో ప్రవేశపెట్టారు.

అలాగే ఈ ట్రాజెక్టరీని కూడా సరిదిద్దాల్సిన అవసరం ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందుకోసం తాజా విన్యాసం అవసరమైనట్లు చెప్పారు. ఆదిత్య ఎల్‌-1లోని వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయని.. లగ్రాంజ్‌ పాయింట్‌-1 దిశగా దూసుకెళ్తోందని ఇస్రో తెలిపింది. అలాగే మరికొన్ని రోజుల్లో మాగ్నెటోమీటర్ మళ్లీ ఆన్ చేస్తామని వెల్లడించారు.

Tags:    

Similar News