బంగారం ధర పెరిగింది.. అయినా పర్లేదు

మూడు రోజుల ధరల తర్వాత దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరగగా, వెండి ధర మాత్రం తగ్గింది

Update: 2022-10-14 03:33 GMT

భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని బంగారం కొనుగోలు చేస్తున్నారు ఇటీవల అనేక మంది. ఆభరణాలే కాకుండా ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా గట్టెక్కించేందుకు బంగారం ఉపయోగపడుతుందని భావించడంతో దేశంలో బంగారానికి డిమాండ్ పెరిగింది. తాము సంపాదించిన దానిలో కొంత బంగారంపై పెట్టుబడిగా పెడుతున్నారు. భూమిపై పెట్టుబడి పెట్టాలంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు అవసరం. అదే బంగారం అయితే ఎంత డబ్బుకు సరిపడా అంత బంగారాన్ని కొనుగోలు చేసి దగ్గరపెట్టుకుంటే మంచిదన్న భావన నేటి రోజుల్లో పెరిగిపోయింది. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి.

తగ్గిన వెండి ధర...
మూడు రోజుల ధరల తర్వాత దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరగగా, వెండి ధర మాత్రం తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,000 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,750 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధర స్వల్పంగా పెరగడంతో ప్రస్తుతం కిలో వెండి ధర 62,500 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News