Nepal : నేపాల్ వరదల బీభత్సం... వందకు మందికిపైగా మృతి
నేపాల్ ను వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే తీవ్రస్థాయిలో నష్టం జరిగింది. ప్రాణ, ఆస్తి నష్టం కూడా సంభవించింది
నేపాల్ ను వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే తీవ్రస్థాయిలో నష్టం జరిగింది. ప్రాణ, ఆస్తి నష్టం కూడా సంభవించింది. నేపాల్ లో వరదల కారణంగా ఇప్పటి వరకూ వందకు మందికి పైగా మరణించగా, చాలా మంది గల్లంతయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నేపాల దేశం వణికి పోతుంది. అనేక ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగిపోయి ప్రజలు నిరాశ్రయులకు గురయ్యారు. ప్రజలు బయటకు రావడానికే భయపడిపోతున్నారు.
గల్లంతయిన వారెందరో?
వరద బాధితులను ఆదుకునేందుకు సైన్యం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. వారిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించింది. నేపాల్ లో ఇప్పటికే జనజీవనం స్థంభించిపోయింది. పర్యాటకులు హోటల్ గదులకే పరిమితమయ్యారు. దీంతో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రాణ నష్టం మాత్రం ఎక్కువ స్థాయిలో జరగడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ వరదల ప్రభావం పొరుగున ఉన్న మన దేశంలోని బీహార్ రాష్ట్రంలో పడింది. నేపాల్ నుంచి బీహార్ లోకి కొన్ని నదులు ప్రవహిస్తున్నందున ఆ నదులకు వచ్చే ఆకస్మికవరదలు ముంచెత్తే అవకాశముందని భావించిన బీహార్ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను మరింత అప్రమత్తం చేశారు. నేపాల్ లో పరిస్థితి ఏమాత్రం బాగా లేదని అక్కడ సాయుధ దళాలు చెబుతున్నాయి. వీలయినంత వరకూ ఎవరూ ఇళ్లు విడిచి బయటకు రావద్దని సూచిస్తున్నారు.