Helen : హెలెన్ తో వణికిపోతున్న అమెరికా... అనేక మంది మృతి.. ఎమెర్జెన్సీ ప్రకటన

అమెరికాలో హెలెన్ హరికేన్ ధాటికి వణికిపోతున్నారు. ఇప్పటికే హెలెన్ కారణంగా ముప్ఫయి మంది వరకూ మరణించారు.

Update: 2024-09-28 03:53 GMT

అమెరికాలో హెలెన్ హరికేన్ ధాటికి వణికిపోతున్నారు. ఇప్పటికే హెలెన్ కారణంగా ముప్ఫయి మంది వరకూ మరణించారు. అమెరికాలో సెప్టంబరు నెల అంటే వణికిపోతారు. ఆ నెల నుంచే హరికేన్లు అమెరికాను చుట్టుముడుతాయి. నవంబరు నెల వరకూ ఇదే పరిస్థితి. అందుకే మూడు నెలల పాటు అమెరికాలోని కొన్ని ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే. ప్రస్తుతం హెలెన్ హరికేన్ల కారణంగా జార్జియా, ఫ్లోరిడా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా వంటి రాష్ట్రాలు వణికి పోతున్నాయి.

ఇళ్లు నేలమట్టం...
నిన్న హరికేన్లు సృష్టించిన భారీ విధ్వంసం కారణంగా అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. హెలెన్ హరికేన్ తీరాన్ని దాటడంతో భారీగా ఈదురుగాలులు వీచాయి. గంటలకు 225 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. జార్జియా రాష్ట్రంలో గంటకు 177 కిలోమీటర్ల ఈదురుగాలులు వీచాయి. దీంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా బంద్ అయింది. హెలెన్ కారణంగా అమెరికాలోని అనేక రాష్ట్రాలు ఇబ్బందులు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది.
హెచ్చరికలు జారీతో...
విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జార్జియాకు కూడా వాతావరణ శాఖ వరద హెచ్చరిక జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. జార్జియా, ఫ్లోరిడా, అలబామా, కరోలినా్, వర్జీనియాలో ఎమెర్జెన్సీ ప్రకటించారు. సహాయక చర్యలను చేపట్టేందుకు సైన్యాన్ని సిద్ధంగా ఉంచారు. హెలెన్ హరికేన్ సౌత్ కరోలినాకు చేరుకోవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ముందు జాగ్రత్తగా ప్రజలు అక్కడి నుంచి ఖాళీ చేసి వెళుతున్నారు. దీంతో అమెరికాలోని అనేక రాష్ట్రాలు హెలెన్ హరికేన్ దెబ్బకు వణికిపోతున్నాయి.


Tags:    

Similar News