Breaking : సేఫ్ ల్యాండ్ అయిన ఎయిర్ ఇండియా విమానం

తిరుచ్చి ఎయిర్ పోర్టులో ఎయిర్ ఇండియా విమానం సేఫ్ గా ల్యాండ్ అయింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

Update: 2024-10-11 15:04 GMT

తిరుచ్చి ఎయిర్ పోర్టులో ఎయిర్ ఇండియా విమానం సేఫ్ గా ల్యాండ్ అయింది. రెండున్నర గంటల తర్వత పైలెట్ సేఫ్ గా ల్యాండ్ చేయగలిగారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడ్డారు. సీనియర్ పైలట్ కావడంతో విమానాన్ని సేఫ్ గా ల్యాండింగ్ చేయగలిగారని విమానరంగయాన నిపుణులు చెబుతున్నారు.

సాంకేతిక లోపంతో...
అంతకు ముందు తిరుచ్చి ఎయిర్ పోర్టులో అధికారుల ఎమెర్జెన్సీని ప్రకటించారు. ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం సంభవించింది. తిరుచ్చి నుంచి షార్జా వెళుతున్న ఈ విమానంలో సాంకేతిక లోపాన్ని తలెత్తింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతికలోపాన్ని గుర్తించిన పైలట్ ఎమెర్జెన్సీని ప్రకటించారు. హైడ్రాలిక్ సిస్టమ్ లో సాంకేతిక లోపం ఉన్నట్లు గుర్తించారు. మొత్తం మీద విమానం సేఫ్ గా ల్యాండ్ అవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


Tags:    

Similar News