బీజేపీ అగ్రనేత అద్వానీకి అస్వస్థత
భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్. కె. అద్వానీ తీవ్ర అస్వస్థతకు గురయ్యా
భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్. కె. అద్వానీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు అద్వానీకి చికిత్స అందిస్తున్నారు. అయితే స్వల్ప అస్వస్థతకు అద్వానీ గురయ్యారని, అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యులతో పాటు వైద్యులు కూడా చెబుతున్నారు.
గత కొద్ది రోజులుగా...
ఎల్ కే అద్వానీ గత కొద్ది రోజులుగా ఇంటికే పరిమితమయ్యారు. తొమ్మిది పదుల వయసు దాటడంతో ఆయన రాజకీయాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఆయన అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు అపోలో ఆసుపత్రికి చేరుకుని అద్వానీ ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు.ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.