నేడు లోక్ సభలో రాజ్యాంగంపై చర్చ

నేడు, రేపు లోకసభలో రాజ్యాంగంపై రెండు రోజుల చర్చ జరగనుంది.

Update: 2024-12-13 04:41 GMT

నేడు, రేపు లోకసభలో రాజ్యాంగంపై రెండు రోజుల చర్చ జరగనుంది. చర్చ కోసం రేపు ప్రత్యేకంగా లోక్ సభ సమావేశంకానుంది. అయితే రేపు శనివారం నాడు రాజ్యసభకు మాత్రం సెలవు ఉంటుంది. రాజ్యాంగంపై రెండు రోజుల పాటు చర్చ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై చర్చ హాట్ హాట్ గా సాగే అవకాశముంది.

రాజ్యసభలో మాత్రం...
సోమ, మంగళవారం రోజుల్లో రాజ్యసభలో రాజ్యాంగం పై రెండు రోజులు చర్చ జరగనుంది. లోకసభలో ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు రాజ్యాంగం పై ప్రత్యేక చర్చ ప్రారంభం కానుంది. ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును కూడా ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. నిన్న కేబినెట్ జమిలి ఎన్నికల బిల్లును ఆమోదించడంతో ఈ బిల్లు కూడా ఉభయ సభల ముందుకు రానుంది.


Tags:    

Similar News