Sabarimala : శబరిమలకు పోటెత్తిన భక్తులు
ఈరోజు శబరిమల కు భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు బారులు తీరారు.
ఈరోజు శబరిమల కు భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు బారులు తీరారు. సన్నిధానం నుంచి పంబ వరకూ క్యూ లైన్ భక్తులతో విస్తరించింది. అయ్యప్ప దర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతుందని ట్రావెన్ కోర్ దేవస్థానం అధికారులు వెల్లడించారు. అయితే భక్తుల రద్దీ దృష్ట్యా శబరిమలలో వీఐపీ ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు.
వీఐపీ దర్శనాలకు...
ఇటీవల సినీనటుడు దిలీప్ కు వీఐపీ దర్శనం చేయించడంతో విమర్శలను ఎదుర్కొన్న దేవస్థానం బోర్డు వాటిని రద్దు చేసింది. భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ట్రావెన్ కోర్ బోర్డు దేవస్థానం తెలిపింది. అదే సమయంలో భక్తులు కూడా బోర్డుకు సహకరించాలని, ముందుగా ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు మాత్రమే రావాలని కోరుతున్నారు.