జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఓకే

దేశంలో జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం పలికింది.

Update: 2024-12-12 13:05 GMT

దేశంలో జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం పలికింది. ఈ మేరకు బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. గతంలోనే మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కమిటీ సిఫారసులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. 2027లో ఎన్నికలకు కేంద్రంలో ఉన్న బీజేపీ సిద్ధమవుతుంది. బీజేపీ ఇప్పటికే తన మిత్ర పక్షాలను జమిలి ఎన్నికలకు ఒప్పించింది.


ఈ సమావేశాల్లో...
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో ఉభయ సభల్లో బిల్లు పెట్టి ఆమోదం పొందాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. జమిలి ఎన్నికలకు ఇండి కూటమి వ్యతిరేకిస్తున్నప్పటికీ ఉభయ సభల్లో తగిన సంఖ్యాబలం ఉండటంతో ఈ సమావేశాల్లోనే బిల్లును ఆమోదించుకోవాలన్న పట్టుదలతో కేంద్ర ప్రభుత్వం ఉందన్నది ఢిల్లీ వర్గాల ద్వారా అందుతున్న సమచారం.




Tags:    

Similar News