Delhi : ఢిల్లీలో స్కూళ్లకు మరోసారి బాంబు బెదిరింపు

దేశ రాజధాని ఢిల్లీలో పాఠశాలలకు నేడు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి

Update: 2024-12-13 04:35 GMT

దేశ రాజధాని ఢిల్లీలో పాఠశాలలకు నేడు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో బాంబ్ స్క్కాడ్ తనిఖీలు చేపట్టింది. ఇటీవల ఢిల్లీలోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి.ఈరోజు పశ్చిమ విహార్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, కేంబ్రిడ్జి విద్యాలయంతో పాటు అనేక విద్యాసంస్థలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈమెయిల్ ద్వారాబాంబులున్నట్లు ఆగంతకులు తెలిపారు.

తనిఖీలు చేయగా...
దీంతో పాఠశాలల్లో విద్యార్థులను బయటకు పంపి తనిఖీలను నిర్వహిస్తున్నారు. అయితే తనిఖీల్లో ఎలాంటి బాంబులు లేవనితేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మొన్నటి వరకూవిమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు వచ్చేవి. ఇప్పుడు పాఠశాలలకు పాకాయి. ఆకతాయిలు చేసే పనిఅయినప్పటికీ ముందుజాగ్రత్త చర్యగా తనిఖీలు నిర్వహిస్తూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.


Tags:    

Similar News