సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్ విడుదల
సీబీఎస్ఈ బోర్డు అధికారిక వెబ్ సైట్ లో ఉంచిన శాంపిల్ క్వశ్చన్ పేపర్ల మాదిరిగానే పరీక్షల ప్రశ్నాపత్రాల ప్యాట్రన్ ఉంటుంది. జేఈఈ మెయిన్..
న్యూ ఢిల్లీ : సీబీఎస్ఈ బోర్డు 10,12వ తరగతుల టర్మ్ -2 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. తాజాగా సీబీఎస్ఈ బోర్డు ఈ పరీక్షల పూర్తి షెడ్యూల్ ను ప్రకటించింది. బోర్డు ప్రకటించిన వివరాల మేరకు.. ఏప్రిల్ 26 నుంచి మే 24 వరకూ 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి. అలాగే ఏప్రిల్ 26 నుంచి జూన్ 15 వరకూ 12వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు ఆఫ్ లైన్ లోనే నిర్వహించనున్నట్లు బోర్డు ఎగ్జామినేషన్ కంట్రోలర్ సన్యం భరద్వాజ్ ఇదివరకే స్పష్టం చేశారు.
కాగా.. సీబీఎస్ఈ బోర్డు అధికారిక వెబ్ సైట్ లో ఉంచిన శాంపిల్ క్వశ్చన్ పేపర్ల మాదిరిగానే పరీక్షల ప్రశ్నాపత్రాల ప్యాట్రన్ ఉంటుంది. జేఈఈ మెయిన్ సహా ఇతర పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని పరీక్షల డేట్ షీట్ ను (cbse.gov.in రూపొందించినట్లు బోర్డు పేర్కొంది. కరోనా కారణంగా ఈ ఏడాది రెండు టర్మ్ లలో పరీక్షలు నిర్వహించాలని సీబీఎస్ఈ నిర్ణయించింది. ఇప్పటికే టర్మ్ 1 పరీక్షలు పూర్తి కాగా.. టర్మ్ 2 పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల డేట్ షీట్ కోసం లింక్ క్లిక్ చేసి చూడండి. (https://www.cbse.gov.in/cbsenew/documents//CircularExam_2022.pdf)