ఏసీ నుండి వచ్చే నీటిని.. అలా అనుకుని తాగేశారు!
ఆలయ నిర్మాణంలో భాగమైన ఏనుగు ఆకారపు నుండి వచ్చే
బృందావన్‌లోని బాంకే బిహారీ ఆలయం వద్ద వందలాది మంది భక్తులు ఏనుగు నోటి లాంటి బొమ్మ నుండి వస్తున్న నీటిని తాగుతూ కనిపించారు. దానిని శ్రీకృష్ణుడి “చరణ్ అమృత్” (పాదాలను తాకిన పవిత్రమైన నీరు) అని భావించేసి తాగేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆలయ నిర్మాణంలో భాగమైన ఏనుగు ఆకారపు నుండి వచ్చే నీటిని పొందడానికి భక్తులు ఆసక్తిగా క్యూలో వేచి ఉన్నారు. చాలా మంది ప్రజలు ఈ నీటిని పవిత్రమైనదని నమ్మారు. అయితే ఈ నీరు కేవలం ఏసీ నుండి వచ్చిన నీరు అంటూ ఈ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న యూట్యూబ్ వ్లాగర్ తెలిపారు. ప్రజలు భావించినట్లుగా పవిత్ర చరణ్ అమృత్ కాదని తెలిపారు. ఈ సంఘటన ఆన్‌లైన్‌లో ఎంతో మంది దృష్టిని ఆకర్షించింది. ప్రజలు బాంకే బిహారీ ఆలయం మేనేజ్మెంట్ జవాబుదారీతనాన్ని ప్రశ్నించారు. భక్తులు పొరపాటుగా AC నీటిని సేవించడంపై ఆందోళనలను వ్యక్తం చేశారు.