పది రూపాయల నాణేలు చెల్లుబాటు అవుతాయ్
పది రూపాయల నాణేలను కొందరు వ్యాపారులు తిరస్కరిస్తున్నట్లు తెలియడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనిపై ఒక ప్రకటన చేసింది
పది రూపాయల నాణేలను కొందరు వ్యాపారులు తిరస్కరిస్తున్నట్లు తెలియడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనిపై ఒక ప్రకటన చేసింది. పది రూపాయల నాణేలు చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. వ్యాపారులు ఎవరూ దానిని తిరస్కరించాల్సిన అవసరం లేదని తెలిపింది. అనేక నాణేలు మార్కెట్ లో ఉన్నాయని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
తిరస్కరిస్తే...
ఎవరైనా వ్యాపారులు పది రూపాయల నాణేలను తీసుకునేందుకు తిరస్కరిస్తే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. చట్ట రీత్యా తిరస్కరించిన వ్యాపారులు శిక్షలకు అర్హులని తెలిపింది. పది రూపాయల నాణేలు మార్కెట్ లో సులువుగా చెలామణి చేసుకోవచ్చని తెలిపింది.