అవును.. సిగ్నల్స్ కోసం వెయిటింగ్

వాటితో సంబంధాలను తిరిగి ఏర్పాటు చేసే ప్రయత్నాలు మాత్రం కొనసాగిస్తామని

Update: 2023-09-23 08:30 GMT

చంద్రుడిపై పరిశోధనలు పూర్తి చేసిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లు స్లీప్ మోడ్ లోకి వెళ్లిన విషయం తెలిసిందే. వాటిని తిరిగి యాక్టివ్ చేయడానికి ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నం చేశారు. విక్రమ్, ప్రజ్ఞాన్‌లు మేల్కొన్నాయా? అనే విషయం తెలుసుకోవడానికి వాటితో కమ్యూనికేషన్ పునరుద్ధరణ ప్రయత్నాలు చేశామని, కానీ వాటి నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదని భారత అంతరిక్ష సంస్థ. వాటితో సంబంధాలను తిరిగి ఏర్పాటు చేసే ప్రయత్నాలు మాత్రం కొనసాగిస్తామని తెలిపింది. చంద్రయాన్-3 ప్రయోగం నేపథ్యంలో విక్రమ్, ప్రజ్ఞాన్‌లు పద్నాలుగు రోజులే పని చేస్తాయి. ఆ తర్వాత అక్కడ సూర్యాస్తమయం కావడంతో రోవర్‌ను ఈ నెల 2న, విక్రమ్‌ను 4న నిద్రాణస్థితిలోకి పంపించారు. చంద్రుడిపై రాత్రివేళల్లో ఉష్ణోగ్రతలు 120 నుంచి 200 డిగ్రీల సెల్సియెస్‌కు పడిపోతాయి. అలాంటి పరిస్థితులను తట్టుకుని ఇవి పని చేసే అవకాశాలు చాలా తక్కువ. ప్రస్తుతం చంద్రుడి దక్షిణ ధృవంపై తిరిగి సూర్యోదయం కావడంతో కమ్యూనికేషన్ పునరుద్ధరణకు ఇస్రో చర్యలు తీసుకుంటోంది.

ఇస్రో స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ దేశాయ్ దీనిపై స్పందిస్తూ.. ఇంతకుముందు తాము సెప్టెంబర్ 22 సాయంత్రం ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్‌ను తిరిగి యాక్టివేట్ చేయాలని అనుకున్నామని తెలిపారు. అయితే కొన్ని కారణాల వల్ల ఇప్పుడు దాన్ని సెప్టెంబర్ 23న చేపట్టనున్నట్లు వెల్లడించారు.


Tags:    

Similar News