నేటి నుంచి కాంగ్రెస్ సత్యాగ్రహ్ భైఠక్
నేటి నుంచి రెండు రోజుల పాటుకాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. కర్ణాటకలోని బెలగావిలో సమావేశం జరుగుుతుంది
నేటి నుంచి రెండు రోజుల పాటుకాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. కర్ణాటకలోని బెలగావిలో జరిగే సీడబ్ల్యూసీ సమావేశాలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. మహాత్మా గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురష్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఈ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తోంది.
రెండు రోజులు సీడబ్ల్యూసీ...
కర్ణాటకలోని బెలగావిలోనే ఈ నెల 26, 27 తేదీల్లో రెండ్రోజుల పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ భేటీకి నవ సత్యాగ్రహ భైఠక్ అని నామకరణం చేసింది. సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత ఆహ్వనితులు, ప్రత్యేక ఆహ్వనితులు, పీసీసీ చీఫ్ లు, సీఎల్పీ నేతలు, పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ బేరర్లు, సీఎంలు, మాజీ సీఎంలు దాదాపు రెండు వందల మంది కీలక నేతలు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేగంపేట నుంచి హెలికాప్టర్లో బెలగావికి బయల్దేరుతారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే సీడబ్ల్యుసీ సమావేశాల్లో పాల్గొంటారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ