హెలికాప్టర్ ప్రమాద ఘటనపై అత్యున్నత స్థాయి విచారణ ప్రారంభం

తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంపై రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ లోక్ సభలో ప్రకటన చేశారు.

Update: 2021-12-09 06:20 GMT

తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంపై రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ లోక్ సభలో ప్రకటన చేశారు. ఈ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ ఆర్మీ బిపిన్ రావత్ తో సహా పదమూడు మంది మృతి చెందారని తెలిపారు. వరుణ్ సింగ్ ఒక్కరే ప్రాణాలతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారన్నారు. ఆయనను బతికించేందుకు ఆర్మీ ఆసుపత్రి వైద్యులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించామని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.

కూలిపోవడాన్ని....
ఎయిర్ మార్షన్ మన్వీంద్ర సింగ్ పర్యవేక్షణలో విచారణ జరుగుతుందని చెప్పారు. నిన్న ఉదయం సుల్లూరు ఎయిర్ బేస్ నుంచి 11.48 గంటలకు హెలికాప్టర్ టేకాఫ్ అయిందని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. 12.15 గంటలకు హెలికాప్టర్ వెల్లింగ్టన్ బేస్ క్యాంప్ నకు చేరుకోవాల్సి ఉందని, అయితే 12.08 గంటలకు సుల్లూరు ఏటీసీ కాంటాక్ట్ తెగిపోయిందని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. హెలికాప్టర్ కూలిపోవడాన్ని ప్రత్యక్ష సాక్షులు గమనించారని తెలిపారు. లోక్ సభలో రెండు నిమిషాలు మౌనం పాటించి మృతులకు సంతాపం ప్రకటించారు.


Tags:    

Similar News