మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ మృతి

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ ఎం కృష్ణ మరణించారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు

Update: 2024-12-10 01:57 GMT

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ ఎం కృష్ణ మరణించారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎస్.ఎం కృష్ణ వయసు 92 ఏళ్లు. ఈరోజు తెల్లవారు జామున బెంగళూరులోని సదాశివనగర్ లో ఆయన మరణించారు. ఎస్ కృష్ణ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2004 -2009 మధ్య కాలంలో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు.

ముఖ్యమంత్రిగా... కేంద్ర మంత్రిగా...
తర్వాత 2004 డిసెంబరు నుంచి 2008 వరకూ మహారాష్ట్ర గవర్నర్ గా విధులు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో విదేశాంగ మంత్రిగా కూడా ఎస్. ఎం కృష్ణ పనిచేశారు. ఎస్. ఎం కృష్ణ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో పాటు వివిధ రాజకీయ పార్టీల నేతలు సంతాపాన్ని ప్రకటించారు. ఆయన కుటుంబానికి సానుభూతిని ప్రకటించారు.


ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download The App Now

Tags:    

Similar News