Sabarimala : అయ్యప్పా.. దారి చూపు మయ్యా?
శబరిమలలో అయ్యప్ప భక్తుల రద్దీ కొనసాగుతుంది, దర్శనానికి పది గంటల సమయం పడుతుంది
శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. అయ్యప్ప దర్శనానికి ఎక్కువ మంది భక్తులు రావడంతో శబరిమల కొండలు స్వామియే శరణం అయ్యప్ప నినాదాలతో మారుమోగుతున్నాయి. పంబ నుంచి సన్నిధానం వరకూ క్యూ లైన్ విస్తరించింది. మండల పూజల కోసం అయ్యప్ప భక్తులు ఎక్కువ సంఖ్యలో చేరుకోవడంతో దర్శన సమయం కూడా ఆలస్యమవుతుంది.
పది గంటల సమయం...
ప్రస్తుతం అయ్యప్ప దర్శనానికి పది గంటల సమయం పడుతుందని ట్రావెన్ కోర్ దేవస్థానం అధికారులు చెబుతున్నారు. అయితే ముందుగా ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న వారితో పాటు సాధారణంగా వచ్చే భక్తులకు కూడా దర్శనం కల్పిస్తున్నట్లు తెలిపారు. దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి రావడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగిందని, అందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.