Breaking : జమిలి ఎన్నికలకు దిశగా కేంద్రం అడుగులు
జమిలి ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమయింది. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తుంది
జమిలి ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమయింది. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తుంది. 2027లో జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాలు తెలిపాయి. ఈ పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం బిల్లు పెట్టే అవకాశముందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే రామ్ నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన నేపథ్యంలోనే ఈ సమావేశాల్లోనే ఉభయసభల్లో బిల్లును ఆమోదించుకుని జమిలి ఎన్నికలకు సిద్ధం కావాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భావిస్తుంది.
2027లో ఒకేసారి...
2027లో ఒకే దేశ వ్యాప్తంగా ఒకే సారి లోక్ సభ, శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఒకే సారి ఎన్నికలు జరగడం వల్ల ఎన్నికల కోడ్ మధ్యలో అడ్డం వచ్చి అభివృద్ధికి ఆటంకం కలగదని భావించిన మోదీ ప్రభుత్వం గత కొద్ది రోజుల నుంచి జమిలి ఎన్నికల గురించి కసరత్తులు చేస్తుంది. మిత్రపక్షాల్లోని పార్టీ అగ్రనేతలను కూడా చర్చించి జమిలి ఎన్నికలకు వెళ్లాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అందులో భాగంగానే ఈ శీతాకాలం సమావేశాల్లోనే బిల్లులను ఆమోదించుకుని మరింత ముందుకు వెళ్లాలని భావిస్తుంది.