Delhi : ఢిల్లీలో రైతుల మార్చ్ - టెన్షన్ టెన్షన్

పంజాబ్ - హర్యానా సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. ఢిల్లీ మార్చ్ తో ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు భారీగా మొహరించారు

Update: 2024-12-08 07:51 GMT

పంజాబ్ - హర్యానా సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. ఢిల్లీ మార్చ్ చేపట్టడంతో దేశరాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు భారీగా మొహరించారు. తమతో చర్చలు జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నిన్న విరామం తీసుకున్న రైతులు 101 మంది ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చల్లో పాల్గొనాలని భావించారు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూలత రాకపోవడంతో తిరిగి చలో ఢిల్లీకి పిలుపు నిచ్చారు.

నాలుగంచెల భద్రత...
ప్రభుత్వం కనౌరీ వద్ద భారీ బందోబస్తు ను నిర్వహిస్తున్నారు. పెద్దయెత్తున భద్రతాదళాలను మొహరించారు. చుట్టూ కంచెలను ఏర్పాటు చేశారు. రైతులు ఎవరూ ఢిల్లీలోకి అడుగుపెట్టకుండా అడుగడుగునా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో వారు మరోసారి చలో ఢిల్లీకి పిలుపు నివ్వడంతో ఉద్రిక్తంగా మారింది. పోలీసులు స్వల్ప లాఠీఛార్జి చేశారు. బోర్డర్ లో ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపేశారు. కనౌరి దగ్గర నాలుగంచెల భద్రతను ఏర్పాటు చేశారు.


ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download The App Now

Tags:    

Similar News