Delhi : ఢిల్లీలో స్కూళ్లకు బాంబు బెదిరింపులు
ఢిల్లీలో పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో విద్యార్థులను పాఠశాలల నుంచి బయటకు పంపి తనిఖీలను చేస్తున్నారు
దేశ రాజధాని ఢిల్లీలో పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో విద్యార్థులను పాఠశాలల నుంచి బయటకు పంపి తనిఖీలను చేస్తున్నారు. ఢిల్లీలోని పలు చోట్ల ఒకేసారి పాఠశాలల్లో బాంబులు పెట్టినట్లు బెదిరింపులు రావడతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే తనిఖీలు ప్రారంభించారు. ఢిల్లీలోని ఆర్కేపురంలోని రెండు స్కూళ్లకు బాంబు బెదిరింపు వచ్చింది.
బాంబు స్క్వాడ్ తనిఖీలు...
ఈ స్కూళ్లకు సంబంధించి బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తున్నాయి. బాంబు పెట్టినట్లు ఈమెయిల్ ద్వారా సమాచారం అందడంతో పాఠశాలల యాజమాన్యం పోలీసులకు వెంటనే సమాచారం ఇచ్చింది. పోలీసులు వచ్చి విద్యార్థులను పాఠశాల నుంచి ఖాళీ చేయించి పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీలో తరచూ ఇలాంటి ఘటనలే జరుగుతుండటంతో పోలీసులు ఈ మెయిల్ పంపిన వారి కోసం ఆధారాలు సేకరిస్తున్నారు.