Manmohan Singh : మన్మోహన్ సింగ్ పుణ్యమే నేడు భారత్ ఈ స్థితిలో

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించారు. అనారోగ్యంతో ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరి చికిత్స పొందుతూ మృతి చెందారు

Update: 2024-12-27 01:39 GMT

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించారు. అనారోగ్యంతో ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరి చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రధాని గా ఆయన దేశానికి అందించిన సేవలను ఈ సందర్భంగా పలువురు గుర్తు చేసుకుంటున్నారు. మన్మోహన్ సింగ్ గత కొన్నేళ్ల నుంచి వృద్ధాప్య సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. గురువారం రాత్రి ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకు వచ్చారు. అయితే అనంతరం ఆయనకు చికిత్స చేస్తుండగా మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఇతర రాజకీయ నేతలు సంతాపాన్ని ప్రకటించారు.

ఆర్థిక వేత్తగా...
మన్మోహన్ సింగ్ ను కేవలం ప్రధానిగా మాత్రమే చూడకూడదు. ఆయన ఒక ఆర్థిక వేత్త. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా, ఆర్థిక మంత్రిగా ఆయన దేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. భారత్ ను ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేయటంతో మన్మోహన్ సింగ్ పాత్రను ఎవరూ తీసివేయలేనిది. అలాగే అనేక ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడిగా ఆయనను రాజకీయ నేతలు భావిస్తారు. దేశ ఆర్థిక వ్యవస్థకు మన్మోహన్ సింగ్ ఒకరకంగా దిక్సూచీగా పనిచేశారని చెప్పాలి. ఆయన చేపట్టిన అనేక సంస్కరణలు, తీసుకున్న నిర్ణయాల ఫలితమే నేడు భారత ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటమే కాకుండా ఇతర అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ ను నిలబెట్టిందని ఎవరైనా చెబుతారు.
రెండుసార్లు ప్రధానిగా...
మన్మోహన్ సింగ్ 1932 సెప్టంబరు 26వ తేదీన జన్మించారు. ఆయన నాడు పాకిస్థాన్ లోని గాహ్ ప్రాంతంలో జన్మించారు. 1947 దేశ విభజన జరిగిన అనంతరం మన్మోహన్ సింగ్ కుటుంబం అమృత్ సర్ కు వచ్చి స్థిరపడింది. చిన్న వయసులోనే తల్లిని కోల్పోయిన మన్మోహన్ సింగ్ నాయనమ్మ దగ్గదర పెరిగి విద్యాభ్యాసాన్ని పూర్తి చేశాడు. ఆయన రిజర్వ్ బ్యాంకు గవర్నగా అందించిన సేవలను చసిమాజీ ప్రధాని పీవీ నరసింహరావు మన్మోహన్ ను రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. తన మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిని చేశారు. ఆ సమయంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలే నేడు దేశాన్ని అభివృద్ధి బాట పయనించేలా చేస్తున్నాయి. తర్వాత అనూహ్యంగా ప్రధాని అయిన మన్మోహన్ సింగ్ 2019 వరకూ కొనసాగారు. 2004 నుంచి 2019 వరకూ ప్రధానిగా భారత్ కు ఆయన అందించిన సేవలు మరువలేనివి. పదేళ్ల పాటు ఆయన ప్రధానిగా కొనసాగారు. మన్మోహన్ సింగ్ మృతితో ఏడు రోజుల పాటు భారత ప్రభుత్వం సంతాపదినాలుగా ప్రకటించింది.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now









Tags:    

Similar News