Delhi Rain : ఢిల్లీలో భారీ వర్షం.. ఎక్కడక్కడ నిలిచిన వాహనాలు
ఢిల్లీలో భారీ వర్షం పడింది. దీంతో రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి
ఢిల్లీలో భారీ వర్షం పడింది. దీంతో రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఈరోజు ఉదయం నుంచి వర్షం పడుతూనే ఉంది. భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. వడగండ్ల వాన కూడా కురిసే అవకాశముందని హెచ్చరికలు జారీ చేసింది. రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అనేక చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది.
ట్రాఫిక్ సమస్య...
వాహనాలు నిలిచిపోవడంతో వర్షంలో తడుస్తూ అనేక మంది ఇబ్బంది పడ్డారు. పోలీసులు నిలిచిపోయిన ట్రాఫిక్ ను క్రమబద్దీకరించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఢిల్లీ యూనివర్సిటీ నార్త్ క్యాంపస్ ప్రాంతంలో అధిక వర్షపాతం నమోదయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈరోజు ఢిల్లీలో కురిసిన భారీ వర్షం కారణంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకున్నాయి.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now