మూడో రోజూ తగ్గిన బంగారం ధర

గత మూడు రోజులుగా బంగారం ధర దేశ వ్యాప్తంగా తగ్గుతూ వస్తుంది. ధర స్వల్పంగా తగ్గినా పసిడి ప్రియులకు మాత్రం ఇది గుడ్ న్యూస్

Update: 2022-03-31 01:56 GMT

బంగారాన్ని పెట్టుబడిగా చూసినప్పుడే దానికి డిమాండ్ అధికంగా ఏర్పడింది. బంగారం, భూమి విలువలను సమానంగా చూస్తుండటంతో తమ వద్ద ఉన్న కొద్దిపాటి సొమ్ముతో బంగారాన్ని కొనుగోలు చేయడానికే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. అందుకే బంగారానికి డిమాండ్ ఏర్పడి ధరలు పెరగుతూ వస్తున్నాయి. కరోనా పీక్ లో ఉన్న సమయంలోనూ బంగారం ధర పెరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. ఇక రష్యా - ఉక్రెయిన్ ల మధ్య యుద్ధ ప్రభావం కూడా బంగారం పై కొంత చూపించిందనే చెప్పాలి. పసిడి కొనుగోళ్లకు ఒక సమయం అంటూ లేకపోవడం కూడా డిమాండ్ పెరగడానికి కారణం.

వెండి స్థిరంగా....
అయితే గత మూడు రోజులుగా బంగారం ధర దేశ వ్యాప్తంగా తగ్గుతూ వస్తుంది. ధర స్వల్పంగా తగ్గినా పసిడి ప్రియులకు మాత్రం ఇది గుడ్ న్యూస్. వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,650 రూపాయలుగా ఉంది. ఇక 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,980 రూపాయలుగా ఉంది. వెండి మాత్రం స్థిరంగా కొనసాగుతుంది. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 72,100 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News