పసిడి ప్రియులకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్తంగా ఈరోజు బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి కిలో పై ఆరు వందల రూపాయల వరకూ తగ్గింది.

Update: 2022-03-29 01:00 GMT

బంగారం అంటేనే ధరల్లో హెచ్చుతగ్గులు సహజం. ఎప్పుడూ ధర పెరుగుతూనే ఉండే బంగారం కాస్త తగ్గిందంటే కొనుగోలుదారులకు ఎంతో ఊరట నిస్తుంది. అయితే ధరల హెచ్చుతగ్గుదలతో సంబంధం లేకుండా కొనుగోళ్లు జరిగేది ఒక్క బంగారం మాత్రమే. బంగారాన్ని కొనుగోలు చేయాలంటే ధరను చూడరు. తమ వద్ద ఉన్న సొమ్ములను బట్టి ఎంత వస్తే అంత బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. బంగారాన్ని పెట్టుబడిగా చూసేవారైతే అసలు ధరల వి‍షయాలను పట్టించుకోరు. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర ఈరోజు స్వల్పంగా తగ్గింది.

తగ్గిన వెండి....
దేశ వ్యాప్తంగా ఈరోజు బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి కిలో పై ఆరు వందల రూపాయల వరకూ తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర 47,950 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,310 రూపాయలు ఉంది. వెండి ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ లో 72, 700 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News