పసిడి ప్రియులకు గుడ్ న్యూస్

ఈరోజు బంగారం, వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. ఈరోజు ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. కిలో వెండి పై వెయ్యి తగ్గింది.

Update: 2022-03-27 01:38 GMT

అవును.. బంగారం ధరలు పెరగకపోతే అది గుడ్ న్యూస్ కిందే లెక్క. ఇటీవల గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు ప్రతి రోజూ పెరుగుతూనే ఉన్నాయి. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు. అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు కావచ్చు. బంగారం ధరలు పెరుగుతుండటం నిత్యం జరుగుతూనే ఉంది. అయినా కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు. పెళ్లిళ్ల సీజన్ కూడా ఉండటంతో జ్యుయలరీ షాపులు కళకళలాడుతున్నాయి.

వెండి తగ్గి...
అయితే దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. ఈరోజు ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. కిలో వెండి పై వెయ్యి తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,590 రూపాయలుగా ఉంది. అదే సమయంలో వెండి కిలోపై వెయ్యి రూపాయలు తగ్గి ప్రస్తుతం మార్కెట్ లో 73,400 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News