పసిడి ప్రియులకు గుడ్ న్యూస్

బంగారం, వెండి ధరలు ఈరోజు దేశంలో స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెల్ లో బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి.

Update: 2022-03-28 01:23 GMT

బంగారం ధర పెరగకపోతే అంతకంటే ఆనందం మరేమీ ఉండదు. వరసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు రెండు రోజుల నుంచి స్థిరంగా కొనసాగుతున్నాయి. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం, అంతర్జాతీయ మార్కెట్ ల ఒడిదుడుకుల ప్రభావం బంగారం పై పడలేదు. అందుకే బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి సమయమని కూడా వారు సూచిస్తున్నారు.

ధరలు ఇలా...
బంగారం, వెండి ధరలు ఈరోజు దేశంలో స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెల్ లో బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం దర 48,200 రూపాయలుగా ఉంది. అదే సమయంలో 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 52,590 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 73,400 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News