పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు

దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు తగ్గాయి. కిలో వెండిపై వెయ్యి రూపాయల వరకూ ధర పెరిగింది

Update: 2022-04-02 01:08 GMT

బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. వరసగా నాలుగు రోజుల నుంచి స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. వెండి ధరలు కూడా పెరగడంతో పసిడి ప్రియులకు షాక్ తగిలినట్లే. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం కారణంగా బంగారం ధరలు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే వారి అంచనాలకు భిన్నంగా గత నాలుగురోజుల నుంచి బంగారం ధరలు పెరగడం లేదు. హమ్మయ్య అనుకునే సమయంలో ఒక్కసారిగా ధరలు పెరిగాయి. అయితే ధరలు స్వల్పంగానే పెరిగాయని, బంగారం కొనుగోలు చేసేందుకు ఇది మంచి సమయమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా....
దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు తగ్గాయి. కిలో వెండిపై వెయ్యి రూపాయల వరకూ ధర పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 48,100 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం దర 52,470 రూపాయలుగా ఉంది. ఇక వెండి కిలోపై వెయ్యి రూపాయల వరకూ పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి 71,700 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News