బ్యాడ్ న్యూస్ .. పెరిగిన బంగారం ధరలు

తాజాగా దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

Update: 2022-03-22 01:02 GMT

బంగారం అంటేనే ప్రియం. రోజరోజుకూ దాని విలువ పెరగడమే కాని తరగదు. వన్నె తగ్గని బంగారం మాదిరి ధర తగ్గని బంగారం అనాలేమో. ఎందుకంటే బంగారం ధర అతితక్కువ సార్లు స్వల్పంగా తగ్గుతుంది. అదే పెరుగుదల మాత్రం ఎక్కువగా ఉంటుంది. దాని కున్న డిమాండ్ ను బట్టి ధరలను నిర్ణయిస్తారు. రోజువారీ ధరల నిర్ణయం కావడంతో ఏరోజు కారోజు బంగారం ధరను కనుక్కుని మరీ కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా మహిళలు ఇష్టపడే ఈ బంగారానికి భారత్ లో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో దీని ధరల పెరుగుదల, తరుగుదలపై అందరి దృష్టి ఉంటుంది.

ధరలు ఇలా...
తాజాగా దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,400 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 51,700 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధర కూడా బాగానే పెరిగింది. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 72,600 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News