మహిళలకు గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు

రెండు రోజులుగా దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. ఈరోజు బంగారం పది గ్రాములపై రూ.300లు, కిలో వెండిపై 1,100 తగ్గింది

Update: 2022-03-17 01:13 GMT

బంగారం అంటేనే మహిళలకు మక్కువ. భారతదేశంలో మహిళలు అత్యంత ఇష్పపడే వస్తువు ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా బంగారమే. తమ ఒంటి మీద కనీసం బంగారం ఉండాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. చిన్న నాటి నుంచే బంగారం పట్ల ఆసక్తి పెంచుకుని, తాను డబ్బులు సంపాదించే పొజిషన్ కు రాగానే బంగారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే భారత్ లో బంగారానికి అంత డిమాండ్. అయితే బంగారం ధరల పెరుగుదల, తగ్గుదల పై కొనుగోళ్లు ఆధారపడి ఉండవు. ఇప్పుడు సీజన్ కూడా మారిపోయింది. ఎప్పుడు డబ్బులుంటే అప్పుడు బంగారాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్నారు.

రెండు రోజుల నుంచి....
గత రెండు రోజుల నుంచి దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. ఈరోజు బంగారం పది గ్రాములపై రూ.300లు, కిలో వెండిపై 1,100 తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,300 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,600 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 72,300 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News