గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి
బంగారం ధర తగ్గిందంటే అది మగువలకు పండగ లాంటి వార్తే. ఎప్పుడూ పెరిగే బంగారం ధర తగ్గిందని తెలిస్తే జ్యుయలరీ షాపులకు క్యూ కడతారు. భారతదేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువ. పండగలు, పెళ్లిళ్లకు మాత్రమే కాకుండా రెగ్యులర్ గా ఆభరణాలుగా వినియోగించే బంగారాన్ని తమకు అవకాశమున్నప్పుడల్లా కొనుగోలు చేస్తారు. ధరలతో సంబంధం లేెకుండా బంగారం కొనుగోళ్లు ఉంటాయి. అందుకే బంగారానికి అంత డిమాండ్ ఉంటుంది.
ధరలు ఇలా....
దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,750 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,100 రూపాయలు ఉంది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 72,100 రూపాయలుగా ఉంది. మార్కెట్ నిపుణులు మాత్రం బంగారం, వెండి కొనుగోళ్లకు ఇది మంచి సమయమని చెబుతున్నారు.