మగువలకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు

దేశంలో బంగారం, వెండి ధరలు ఈరోజు కూడా పెరిగాయి. పది గ్రాముల బంగారంపై రూ.280, కిలో వెండిపై వెయ్యి పెరిగింది.

Update: 2022-03-26 01:26 GMT

భారత్ లో బంగారానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. బంగారం అంటే మోజు ఎక్కువ కావడంతో రేటుతో సంబంధం లేకుండా కొనుగోలు చేయడం వల్లనే ఈ డిమాండ్ నెలకొంది. బంగారం ధర పెరిగినా కొనుగోళ్లు తగ్గకపోవడాన్ని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. బంగారం, వెండి ప్రతి ఇంట్లో ఒక ప్రతిష్టాత్మకమైన వస్తువులుగా మారాయి. ఎంత గోల్డ్ ఉంటే అంత రిచ్ అన్న ఫీలింగ్ ఒక వైపు, పెట్టుబడిగా బంగారం ఉపయోగపడుతుందని మరొక వైపు ఇలా బంగారానికి డిమాండ్ పెరుగుతూనే ఉంది.

ధరలు ఇలా....
తాజాగా దేశంలో బంగారం, వెండి ధరలు ఈరోజు కూడా పెరిగాయి. పది గ్రాముల బంగారంపై రూ.280, కిలో వెండిపై వెయ్యి పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 52,590 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్ లో కిలో వెండి ధర 73,800 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News