స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. బంగారం పది గ్రాములపై రూ.200లు, వెండి కిలోపై 1,110లు పెరిగింది

Update: 2022-03-18 01:08 GMT

బంగారం ఎప్పుడు పడితే అప్పుడు కొనుగోలు చేయవచ్చు. తమ అవసరాలకు విక్రయించుకోవచ్చు. ఇక బంగారం కుదువ సంస్థలు కూడా అనేకం ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొచ్చాయి. మార్కెట్ లో ఆరోజు ఉన్న ధరను బట్టి బంగారాన్ని తాకట్టు పెట్టుకుని క్షణాల్లో డబ్బులు ఇచ్చే సంస్థలు కోకొల్లలు. ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకులే కాకుండా, అనేక ఫైనాన్స్ సంస్థలు ఈ బంగారం తాకట్టు వ్యాపారంలోకి దిగాయి. అవసరం తీరాక డబ్బు చెల్లించి తమ బంగారాన్ని తాకట్టు నుంచి విడిపించుకోవచ్చు. అందుకే బంగారానికి అంత డిమాండ్. ఎప్పుడూ జ్యుయలరీ షాపులు కిటకిటలాడేది అందుకేనంటారు.

వెండి ధరలు మాత్రం...
తాజాగా ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. బంగారం పది గ్రాములపై రూ.200లు, వెండి కిలోపై 1,110లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,450 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,760 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి హైదరాబాద్ మార్కెట్ లో 72,900 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News