పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు

తాజాగా దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి

Update: 2022-03-19 01:54 GMT

బంగారం అంటే భారతీయ మహిళలకు మక్కువ ఎక్కువ. అందుకే ఇండియాలో బంగారానికి ఎప్పుడూ డిమాండ్ తగ్గదు. బంగారానికి వన్నె ఎప్పటికీ తగ్గనట్లుగానే విలువ కూడా అంతే. విలువ పెరగడమే తప్ప తరగడం పెద్దగా ఉండదు. ఉక్రెయిన్ - రష్యా యుద్ధం ప్రభావం బంగారం మార్కెట్ పై పడింది. అలాగే అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపనున్నాయి.

ధరలు ఇలా....
తాజాగా దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,450 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,770 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో వెండి ధర 72,900 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News