పెరిగిన బంగారం ధరలు.. మగువలకు షాక్

ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. బంగారం పదిగ్రాముల పై రూ.350లు, కిలో వెండి పై రూ.300 లు పెరిగింది.

Update: 2022-04-10 02:12 GMT

బంగారం అంటే మోజు లేనిదెవరికి? ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఇష్టపడేది బంగారాన్నే. కాలాలు, ధరలతో సంబంధం లేకుండా కొనుగోలు చేసేది బంగారం ఒక్కటే. ఎందుకంటే దానికున్న విలువ ఆపాటిది. అందుకే బంగారం ధరల పెరుగుదలను కొనుగోలు చేసేవారు ఎప్పుడూ చూడరు. తమ వద్ద డబ్బులుంటే ధరను చూడకుండా కొనుగోలు చేయడం భారతీయ మహిళలకు అలవాటు. అందుకే దేశంలో బంగారానికి అంత డిమాండ్. బంగారం ధర పెరుగుదల, తగ్గుదలకు మార్కెట్ నిపుణులు అనేక కారణాలు చెప్పినా వాటిని కొనుగోలుదారులు పెద్దగా పట్టించుకోరు. అందుకే జ్యుయలరీ షాపులు ఎప్పుడూ కిక్కిరిసి పోతూనే ఉంటాయి. ఒక మోస్తరు పట్టణంలోనూ బ్రాండెడ్ జ్యుుయలరీ షాపులను ప్రారంభిస్తున్నారు.

ధరలు ఇలా.....
ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. బంగారం పదిగ్రాముల పై రూ.350లు, కిలో వెండి పై రూ.300 లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 48,600 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 53,020 రూపాయలుగా ఉంది. వెండి హైదరాబాద్ మార్కెట్ లో కిలో 71.500 రూపాయలు పలుకుతోంది.


Tags:    

Similar News