పెరిగిన బంగారం, వెండి ధరలు

దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి

Update: 2022-04-09 01:50 GMT

బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు మామూలే. దాని గురించి పెద్దగా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. బంగారానికి ఉన్న డిమాండ్ ను బట్టి, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకుకలు వంటి కారణాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. బంగారాన్ని పెట్టుబడిగా భావించడం ప్రారంభమయినప్పటి నుంచే దాని ధరలకు రెక్కలు వచ్చాయని చెప్పాలి. బంగారం ధర పెరగడమే కాని తగ్గుదల తక్కువగా ఉంటుందని మార్కెట్ నిపుణులు ఎప్పటికప్పుడు సూచిస్తున్నారు. అందుకే ధరలతో సంబంధం లేకుండా బంగారం కొనుగోళ్లు జరుగుతూ ఉంటాయి.

స్వల్పంగానైనా....
దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 48,250 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,630 రూపాయలుగా ఉంది. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 71,300 రూపాయల వద్ద కొనసాగుతుంది.


Tags:    

Similar News