గుడ్ న్యూస్ ... తగ్గిన బంగారం ధర

బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులుతుంటాయి. తాజాగా ఈరోజు బంగారం ధర స్వల్పంగా తగ్గింది.

Update: 2022-06-05 02:20 GMT

gold, silver, hyderabad

బంగారం ధర ఎప్పుడు పెరుగుతుందో? ఎప్పుడు తగ్గుతుందో చెప్పలేం. డిమాండ్ ను బట్టి వాటి ధరలు ఉంటాయి. నిత్యం బంగారం ధరల పెరుగుదల కొంత ఆందోళన కల్గిస్తుంది. సాధారణంగా వేసవిలో బంగారం ధరలకు రెక్కలొస్తుంటాయన్నది మార్కెట్ నిపుణుల అభిప్రాయం. ఈ సీజన్ లో పెళ్లిళ్లు ఎక్కువగా ఉండటం కారణంగా బంగారానికి డిమాండ్ ఉంటుందని మరో విశ్లేషణ కూడా లేకపోలేదు. అయితే పేద నుంచి ధనికుల వరకూ బంగారం కొనుగోళ్లపై ఆసక్తి చూపుతారు. వారు చూపుతున్న ఆసక్తి డిమాండ్ ను పెంచుతుండటంతో బంగారం ధర కూడా పెరిగే అవకాశముంది.

వెండి కూడా....
అయితే బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులుతుంటాయి. తాజాగా ఈరోజు బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఇప్పుడు 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,100 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,100 రూపాయలుగా ఉంది. వెండి ధర కూడా తగ్గుముఖం పట్టింది. మార్కెట్ లో కిలో వెండి ధర వెయ్యి రూపాయలు తగ్గి 61,700 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News