షాకింగ్ న్యూస్... పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు మళ్లీ ఈరోజు కూడా భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

Update: 2022-06-04 01:33 GMT

బంగారం అంటే మహిళలకు ప్రీతి. మధ్య, ఎగువ, ధనిక వర్గాలకు తేడా లేకుండా బంగారం కొనుగోళ్లకు ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే బంగారానికి ఎప్పుడూ డిమాండ్. బంగారాన్ని ప్రస్తుతం పెట్టుబడిగా కూడా చాలా మంది చూస్తుండటం కూడా గిరాకీ పెరగడానికి కారణం. అందుకే వీధికొక జ్యుయలరీ షాపులు పుట్టుకొచ్చాయి. సీజన్ తో నిమిత్తం లేకుండా కొనుగోళ్లు చేసేది ఒక్క బంగారమే. అందుకే బంగారాన్ని అందరూ అపురూపంగా చూస్తారు. గ్రాము నుంచి బిస్కట్ వరకూ తాహతును బట్టి కొనుగోలు చేస్తుండటంతోనే డిమాండ్ అధికంగా ఉంటుంది.

వెండి మాత్రం.....

బంగారం ధరలు మళ్లీ ఈరోజు కూడా భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరల వివరాలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,740 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 48,100 రూపాయలుగా ఉంది. బంగారం నిన్నటి కంటే ఎక్కువగా పెరిగింది. ఇక వెండి ధరలో కూడా స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర రూ.68,500 లుగా ఉంది.. 

Tags:    

Similar News